అ.ఆ.ఇ.ఈ.
తెలుగు మాట్లాడం అని మెళ్లో బోర్డు తప్పకుండా కట్టాల్సిందే..
ఆ కట్టిన వాడికి దెబ్బ తగిలినప్పుడు మమ్మీ అని మాత్రమే అరిస్తే!
ఆ కట్టిన వాడికి దెబ్బ తగిలినప్పుడు మమ్మీ అని మాత్రమే అరిస్తే!
Labels: ఆలోచన, చర్చ, దుర్మార్గం
October 27, 2009 at 3:44 PM
తెలుగు మీడియం చదువుల వల్ల ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నప్పుడు ఇంగ్లిష్ మీడియమే బెటర్ కదా. top
October 27, 2009 at 3:51 PM
>>"ఆ కట్టిన వాడికి దెబ్బ తగిలినప్పుడు మమ్మీ అని మాత్రమే అరిస్తే!"
చక్కగా చెప్పారు. మరి వాడికి నాలుగు తగిలిద్దామా? top
October 27, 2009 at 4:03 PM
ఆ పిల్లల మొహాలు చూస్తుంటే చాలా ఏడుపొచ్చేస్తుంది.దిక్కుమాలిన పోటీ ప్రపంచం ..చిన్నారులను కనీసం తమకు నచ్చిన భాషలో మాట్లాడనీయకపోతే ఎలా..పైగా దోషుల్లా మెడలో బోర్డ్లా ..చాలా చాలా అన్యాయం ఇది .. top
October 27, 2009 at 4:12 PM
మితృడు ప్రవీణ్ శర్మ:
నేనేమీ ఇంగ్లీషు మీడియానికి వ్యతిరేకం కాదు.
కానీ, ఎంత మంది ఇంట్లో ఇంగ్లీషు మాట్లాడుతున్నారు?
ఇంట్లో ఏభాష మాట్లాడితే.. అదే భాష పిల్లలు స్వతహాగా నేర్చుకుంటారు కదా?
మరి, అందరి ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో పిల్లలను చదివించే తల్లిదండ్రులు అందరూ.. ఇంగ్లీషు వచ్చిన వారే అయి ఉండాలని ఒక రూల్ పెడితే సరిపోతుంది కదా.. అది మాత్రం చేయరు ఏ స్కూలు వాళ్లూ.. ఎందుకంటే పిల్లలెవరూ జాయిన్ కారు, తమ బిజినెస్ పడిపోతుంది కాబట్టి.
ప్రపంచంతో పాటూ మనమూ మారాలి. కానీ ఇంతగా కాదు. కనీసం అప్పుడే.
మరో పదేళ్ల తర్వాత ఇవ్వాల్సిన పనిష్మెంటుని ఆ టీచర్ ఇప్పుడే ఇచ్చేశారనుకుంటా.
అప్పుడైతే, ఇంగ్లీషు వచ్చిన మమ్మీ డాడీలు ఉంటారు అందరి ఇళ్లలోనూ..
ఏమంటారు? top
October 27, 2009 at 4:22 PM
నేను చదివిన స్కూల్ లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేసేవాళ్ళు. బోర్డులు కట్టలేదు. top
October 27, 2009 at 4:24 PM
ముందు ఇది ప్రభుత్వం తప్పు ,ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో తెలుగు ను ఒక అంశముగా తప్పక భోదిం చాలని జి.ఓ జారి చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. top
October 27, 2009 at 11:10 PM
అంత సరదా ఉంటే ఇంకమ్ టాక్స్ ఆఫీస్ లో తెలుగులో వ్రాసిన లెక్కలు చూపించండి. వాళ్ళు తీసుకుంటారో, లేదో తెలుస్తుంది. ఇంగ్లిష్ రాకపోతే ఇలాంటి ప్రోబ్లంసే వస్తాయి. top